ఆంధ్రప్రదేశ్ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలు.. ఏపీ సెట్స్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. షెడ్యూల్‌ విడుదల అనంతరం మంత్రి సురేష్‌ వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు.

 

ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారన్నారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీబీ ఆర్కిటెక్చర్‌ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

 

పై పరీక్షలను సరిగ్గా ప్రిపేరైతే.. మంచి విద్యావకాశాలు దక్కించుకోవచ్చు. ఇందుకు సరైన ప్రణాళిక అవసరం. పాత పరీక్ష పత్రాలను పరిశీలించి ప్రశ్నల ట్రెండ్ ను అంచనా వేసుకోవచ్చు. కేవలం కొన్ని పుస్తకాలపైనే ఆధారపడకుండా కాన్సెప్టు ఓరియెంటెడ్ గా చదివితే మంచి ర్యాంక్ సొంతం చేసుకుని చక్కటి భవిష్యత్ కు పునాది వేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: