రైల్వే శాఖ.. భారత దేశంలో కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగం సంస్థ. ఇందులో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే. అలాంటి భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ఖాళీలు: 100 ఉన్నాయి. అవి ఏం ఉద్యోగాలంటే.. వర్క్స్ ఇంజినీర్, జియాలజిస్ట్, సీనియర్ వర్క్స్ ఇంజినీర్, సైట్ సూపర్వైజర్, సీనియర్ సైట్ సూపర్‌వైజర్. ఈ ఉద్యోగాలు పొందాలంటే.. సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజినీరింగ్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 

అనుభవం కూడా కొన్ని పోస్టులకు అవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ద్వారా ఎన్నుకుంటారు. దరఖాస్తు విధానం.. ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.

 

అప్లయ్ చేయడానికి చివరితేదీ: జనవరి 21, 2020. మరిన్ని వివరాల కోసం http://ircon.org/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. కాస్త కష్టపడి ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారంటే.. ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిర పడే అవకాశం ఉంటుంది. టెంపరరీ పోస్టులన్న సంగతి మరిచిపోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: