నాబార్డు.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుతం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్.. దీని పూర్తి పేరు. ఇందులో 154 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడంది. జనవరి 10 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

దీని ప్రధాన కేంద్రం ముంబ‌యి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 10 న పూర్తి ఉద్యోగ ప్రకటన వెలువడుతుంది.

 

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజ‌ర్‌ ( గ్రేడ్-) - ఖాళీల సంఖ్య: 154,

మళ్లీ వీటిలో రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌ కోసం 139 పోస్టులు, రాజ్‌భాష స‌ర్వీస్‌ కోసం 8 పోస్టులు, లీగ‌ల్ స‌ర్వీస్‌ కోసం 3 పోస్టులు, ప్రోటోకాల్, సెక్యూరిటీ స‌ర్వీస్‌ కోసం 4 పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం 154 పోస్టులన్నమాట.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 10.01.2020 న ప్రారంభమై.. 31.01.2020న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం

www.nabard.org అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: