సెమిస్టర్ విధానం.. ఇప్పటి వరకూ కళాశాల స్థాయికే పరిమితమైన ఈ విధానం ఇప్పుడు పాఠశాల విద్యలోనూ రాబోతోంది. సెమిస్టర్‌ విధానాన్ని స్కూళ్లలోనూ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం-2020 నివేదిక ఈ విషయాన్నే రికమెండ్ చేసింది.

 

పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఈ విధానం సూచించింది. చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

పాఠశాల విద్యలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమికవిద్యతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6-8 తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత,పరస్పర సహకార విధానం బోధించాలని ఈ కొత్త విద్యావిధానం చెబుతోంది.

 

మరి ఈ విధానాన్ని రాష్ట్రాలు పాటిస్తాయా.. ఆ మేరకు మార్పులు చేస్తాయా అన్నది ఆయా రాష్ట్రప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: