ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి ఉద్యోగాలు లేక రోడ్డును ప‌డుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నారు. అలాంటి వారంద‌రికి గుడ్ న్యూస్‌. ఎందుకంటే.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. భిలాల్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 358 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  ఇక ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 154, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 204 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

 

దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ https://portal.mhrdnats.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఖాళీల వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 358. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 154. వీటిల్లో.. మెకానికల్- 20, ఎలక్ట్రికల్- 20, మెటల్లార్జీ- 30సివిల్- 6, ఎలక్ట్రానిక్స్- 16, కంప్యూటర్ సైన్స్ / ఐటీ- 16, మైనింగ్- 30, కెమికల్- 10, సిరామిక్- 6 ఖాళీలు ఉన్నాయి.

 

అలాగే టెక్నీషియన్ అప్రెంటీస్- 204. ఇందులో మెకానికల్- 40, ఎలక్ట్రికల్- 30, మెటల్లార్జీ- 60, సివిల్- 6, ఎలక్ట్రానిక్స్- 10, కంప్యూటర్ సైన్స్ / ఐటీ- 16, మైనింగ్- 30, కెమికల్- 6, సిరామిక్- 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 2 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20. అలాగే విద్యార్హత ఏంటంటే..  గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా అర్హత ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: