పదో తరగతి తర్వాత ఏం చేయాలంటే నూటికి 90 శాతం మంది సమాధానం ఇంటర్ అనే వస్తుంది. మరి పిల్లల భవిష్యత్ బావుండాలంటే.. ప్రైవేటు కాలేజీలే గతి అనే ధోరణి ఉంది. వీటికి లక్షలకు లక్షలు ఫీజులు కట్టాలి. మరి అలా కాకుండా.. ఖర్చు లేకుండానే నాణ్యమైన విద్య లభించే సువర్ణ అవకాశం.. అందిస్తోంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ

 

2020-21 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2020 అంటారు.

 

ఈ పరీక్ష రాసేందుకు అర్హత 2019-20 విద్యాసంవత్సరంలో ఐసీఎస్‌సీ/ సీబీఎస్‌సీ ద్వారా పదోతరగతి, 2020 మార్చిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షతేది: మార్చి 01, 2020.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ జనవరి 8, 2020 న ప్రారంభమవుతుంది. జనవరి 28, 2020 న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://www.tswreis.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: