తమిళనాడులోని అటవీ రంగంలో ఉద్యోగాలకు ఈరోజు, రేపు వాకిన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు. నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లిపోవచ్చు. కోయంబత్తూర్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్.. ఐ ఎ జీ టీ బీ లో టెంపరరీ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు: 84 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

 

ఆసక్తి ఉన్నవారు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 8, 9.2020. ఆసక్తి ఉంటే.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ కు నేరుగా వెళ్లవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే http://www.ifgtbenvis.in/ వెబ్ సైట్ చూడొచ్చు. మీకు అటవీరంగం అంటే ఇష్టమైతే ఓ ప్రయత్నం చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: