ఇప్పుడు చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. కానీ కొన్ని ప్రత్యేక ఉద్యోగాలకు అదనపు అర్హతలు అవసరం. అలాంటిదే ఈ ఆర్మీ ఉద్యోగం.

ఇండియన్‌ ఆర్మీ.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌.. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 48వ కోర్సుద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 

ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవాలంటే.. డిగ్రీతో పాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.. అంతే కాదు.. అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే వీటికి అర్హులవుతారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లు మొత్తం ఖాళీలు: 55 ఉన్నాయి.

 

వీటిలో 50 పురుషులకు మరో 50 స్త్రీలకు కేటాయించారు.వయసు: 01.07.2020 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ఫిబ్రవరి 6న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://joinindianarmy.nic.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: