అన్ని ఉద్యోగాలకూ రాత పరీక్ష, ఇంటర్వూలు ఉండవు. కొన్ని ఉద్యోగాలు నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థిని పరిశీలించి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అలాంటి వాటిలోనేషనల్ ఫిజికల్ ల్యాబ్ లో ఉద్యోగాలు ఒకటి.

 

ఈ నేషనల్ ఫిజికల్ ల్యాబ్ ఢిల్లీలో ఉంది. ఈ సీఎస్ఎఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) టెంపరరీ బేసిక్ మీద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 23 పోస్టులు ఉన్నాయి.

 

ఏ ఏ విభాగాలంటే.. జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్ తదితరాలు. ఈ ఉద్యోగాలకు అర్హత ఆయా పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు.

 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ ఉండదు. నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు వచ్చేయవచ్చు. వాక్ ఎప్పుడంటే.. జనవరి 20, 2020. వేదిక: సీఎస్ఐఆర్-ఎస్ ఎల్

డాక్టర్ కేఎస్, కృష్ణన్ మార్గ్, న్యూదిల్లీ-110012. మరిన్ని వివరాల కోసం http://www.nplindia.in/ వెబ్ సైట్ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: