తెలంగాణలో ఇటీవల కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పూర్తియిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి కమిషనర్ కొన్ని సూచనలు చేస్తున్నారు.

 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, వికారాబాద్ నుంచి పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ సీటీసీ మైదానంలో రిపోర్టు చేయాలని కమిషనర్ వీసీ.సజ్జనార్‌ సూచించారు.

 

వీరిని వివిధ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాలకు పంపించనున్నట్లు చెప్పారు. రిపోర్టు చేసేవారు. ఒరిజినల్ ధ్రువపత్రాలు, జత జిరాక్సు ప్రతులు, ఆధార్, పాన్‌కార్డులు, పది పాస్పోర్టు
ఫొటోలు తీసుకురావాలి. శిక్షణ పూర్తయిన తర్వాత కనీసం ఐదేళ్లు సేవలదిస్తామని రూ.100నాన్ జుడిషియల్ స్టాంపుపై రూ.5వేల సెక్యురిటీ బాండ్ అందజేయాల్సి ఉంటుంది.

 

శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేసేప్పుడు మెస్, ఇతర ఛార్జీల కోసం రూ.6వేలు జమ చేయాల్సి ఉంటుందని వివరించారు. కాబట్టి కానిస్టేబుల్ ట్రైనింగ్ కు హాజరయ్యే వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: