బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్‌. ఇటీవ‌ల కాలంలో బ్యాంకులో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7870 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మ‌రోవైపు 73 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది నాబార్డ్. ఇక తాజా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.

 

ఈ నేప‌థ్యంలోనే మరో 154 ఖాళీలను భర్తీ చేయనుంది. 2020 జనవరి 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజైంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ జనవరి 15న విడుదలవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.nabard.org/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ ఫాలో కావచ్చు.

 

మొత్తం 154 ఖాళీలను ప్రకటించింది నాబార్డ్. అందులో అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)- 139, అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (రాజ్‌భాషా సర్వీస్)- 08, అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (లీగల్ సర్వీస్)- 03, అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్)- 04 పోస్టులున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 1న ప్రారంభం కాగా, దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆస‌క్తిగ‌ల‌వారు వెంట‌నే ద‌ర‌కాస్తు చేయ‌వ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: