తెలంగాణలోని మణుగూరులో భారజల కర్మాగారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ హెవీ వాటర్ బోర్డ్ భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి అనుబంధంగా ఉంటుంది. ఈ హెవీ వాటర్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హెవీ వాటర్ ప్లాంట్లు, డీఏఈ యూనిట్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

ఈ ప్లాంట్లలో మొత్తం ఖాళీలు: 277 పోస్టులు ఉన్నాయి. అవి. టెక్నికల్ ఆఫీసర్, సై పెండరీ ట్రెయినీ, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, తదితరాల రకాలు.

 

ఈ పోస్టులకు పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా
(
ఇంజినీరింగ్), బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత అర్హతలుగా ఉన్నాయి. కంప్యూటర్, టైపింగ్ స్కిల్స్, అనుభవం కూడా ఉద్యోగాన్ని బట్టి అవసరం ఉంటుంది.

 

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ: జనవరి 31, 2020. మరిన్ని వివరాల కోసం

http://www.hwb.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: