ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నాయి. నోటిఫికేష‌న్స్ ప‌డుతున్నాయ‌ని తెలియ‌క మంచి మంచి అవ‌కాశాల‌ను మిస్ చేసుకుంటున్న వారు మ‌రికొంద‌రు. ఇదిలా ఉంటే.. సెంట్రల్ రైల్వే క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 251 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ రైల్వే. 

 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrccr.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం 251 ఖాళీలు ఉన్నాయి. అందులో జూనియర్ క్లర్క్ పోస్టులు 171 ఉండ‌గా, సీనియర్ క్లర్క్ పోస్టులు 80 ఉన్నాయి. విద్యార్హత చూస్తే.. జూనియర్ క్లర్క్ పోస్టుకు 12వ తరగతి పాస్ కావడంతో పాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి 30 పదాలు, హిందీలో నిమిషానికి 25 పదాలు టైప్ చేయాలి. 

 

మ‌రియు సీనియర్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. వయస్సు.. 42 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. అర్హత.. భారతీయ రైల్వేలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 19. అంతే ఇంకా మ‌రో రెండు రోజుల్లో గ‌డువు ముగియ‌నుంది. కాబ‌ట్టి అర్హులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే ద‌ర‌కాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: