ఇంట‌ర్ పాస్ అయ్యారా..? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం జాబ్స్ ఎదురుచూస్తున్నాయి. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇంటర్ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మ‌రి వాటిపై ఓ లుక్కేసి.. అప్లై చేసేయండి మ‌రి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  మొత్తం 418 ఖాళీలతో ఎన్‌డీఏ ఎన్ఏ 1 2020 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 28 చివరి తేదీ. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 

 

ఇంటర్ లేదా 10+2 పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. మరి ఎలా అప్లై చేయాలో తెలుసా.. తెలియ‌క‌పోతే ఇప్పుడు తెలుసుకోండి. దీనికి ముందుగా https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో National Defence Academy and Naval Academy Examination (I), 2020 లింక్ పైన క్లిక్ చేయండి. దరఖాస్తు చేసేముందు నియమనిబంధనలు పూర్తిగా చదవండి. ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 

 

ఆన్‌లైన్ ఆప్లికేష‌న్ ఫ‌ర్ వైరియ‌స్ య‌క్సామినేష‌న్స్ ఆప్ యూపిఎస్‌సి లింక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన్‌డీఏ 2020 అప్లికేషన్ పేజీ కనిపిస్తుంది.  మొదట పార్ట్‌-I రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాలి. ఫీజు చెల్లించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో ఇంటర్మీడియట్ లేదా 10+2 పాసైనవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: