కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు తమ సామాజిక వర్గానికి చెందిన పేద, తెలివైన విద్యార్థులకు చేయూత అందించం సహజమే. అలాగే ఇప్పుడు మున్నూరు కాపు విద్యార్థులకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ సంఘం స్కాలర్ షిప్పులు అందిస్తోంది.

 

అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన ఇచ్చింది. ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు హెచ్ కిషన్, ప్రధాన కార్యదర్శి జీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.

 

2019లో ఎస్సెస్సీలో 100 శాతం, ఇంటర్లో 98 శాతం, మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కోర్సుల్లో 80శాతానికి పైబడి మార్కులు సాధిస్తే స్కాలర్ షిప్పులు ఇస్తారు. అందులోనూ పై అర్హతలు ఉన్నవారిలో పేదలు, అనాథలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

 

ఇంకా ఈ స్కాలర్ షిప్పులకు సంబంధించిన ఇతర వివరాలు కావాలంటే.. ఫోన్ నంబరు 040-27849399లో సంప్రదించవచ్చని వారు తెలిపారు. ఆయా సామాజిక వర్గానికి చెందిన మేధోవంతులైన యువతకు ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడకపోయినా.. దీన్ని మీరు సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేయండి. అర్హులైన వారికి ఉపయోగపడుతుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: