యువ‌త భాగ‌స్వామ్యం పైనే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని జిహెచ్ఎంసి ఎన్నిక‌ల విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్ కెన‌డి పేర్కొన్నారు. ఈనెల 25న నిర్వ‌హిస్తున్న‌ జాతీయ ఓట‌రు దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం చాద‌ర్‌ఘాట్ విక్ట‌రీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియం నందు నిర్వ‌హించిన హైద‌రాబాద్ జిల్లా స్థాయి పోటీల‌లో గెలుపొందిన విద్యార్థుల‌కు డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో క‌లిసి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.  ఈ నెల 24న నిర్వ‌హించే రాష్ట్ర‌స్థాయి పోటీల‌లో పాల్గొనేందుకు వ్యాస‌ర‌చ‌న పోటీల‌లో జూనియ‌ర్ కేట‌గిరిలో ముగ్గురు, సీనియ‌ర్ కేట‌గిరిలో ముగ్గురు, వ‌కృత్వ పోటీల‌లో జూనియ‌ర్ కేట‌గిరిలో ముగ్గురు, సీనియ‌ర్ కేట‌గిరిలో ముగ్గురు చొప్పున మొత్తం 12మంది విద్యార్థుల‌ను ఎంపిక చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ఎంసి సెక్ర‌ట‌రి కిషోర్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు విజ‌య‌కృష్ణ‌, ర‌మేష్‌, ఇస్లావ‌త్ సేవ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

హైద‌రాబాద్ జిల్లా స్థాయి జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల‌లో గెలుపొందిన విద్యార్థుల వివ‌రాలు:

వ‌కృత్వ పోటీలు జూనియ‌ర్స్‌:
1. ఫాతిమా, ఇంట‌ర్‌ ఫ‌స్ట్ ఇయ‌ర్, ఏషియ‌న్ గ్రామ‌ర్ జూనియ‌ర్ కాలేజ్ - ప్ర‌థ‌మ‌ బ‌హుమ‌తి
2. శుభ‌క‌రి, 9వ త‌ర‌గ‌తి, నారాయ‌ణ స్కూల్ - ద్వితీయ‌ బ‌హుమ‌తి
3. సార‌య్య‌, 9వ త‌ర‌గ‌తి, ఎస్‌.వి ప‌బ్లిక్ స్కూల్ - తృతీయ బ‌హుమ‌తి
వీరితో పాటు మాన‌స, గ‌ర్ల్స్ హై స్కూల్ జామియా ఉస్మానియాకు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి ఇచ్చారు.

వ‌కృత్వ పోటీలు సీనియ‌ర్స్‌:
1. సుమ‌న్ కుమారి, ఐ.ఐ.ఎం.సి, ఖైర‌తాబాద్ - ప్ర‌థ‌మ బ‌హుమ‌తి
2. అభ‌య్ తివారి, ఐ.ఐ.ఎం.సి, ఖైర‌తాబాద్ - ద్వితీయ బ‌హుమ‌తి
3. అనురూన్ క‌న్న‌న్‌, ఏషియ‌న్ గ్రామ‌ర్ డిగ్రీ కాలేజ్‌, బ‌హ‌దూర్‌పుర - తృతీయ బ‌హుమ‌తి

వ్యాస‌ర‌చ‌న పోటీలు జూనియ‌ర్స్‌:
1. బి.చంటి, గ‌వ‌ర్న‌మెంట్ జూనియ‌ర్ కాలేజ్‌, సీతాఫ‌ల్ మండి - ప్ర‌థ‌మ బ‌హుమ‌తి
2. టి.యుక్తాశ్రీ‌, శ్రీ‌చైత‌న్య స్కూల్ గ‌డ్డిఅన్నారం - ద్వితీయ బ‌హుమ‌తి
3. వి.మౌనిక‌, గ‌వ‌ర్న‌మెంట్ హై స్కూల్‌, జ‌మా-ఇ-ఉస్మానియా - తృతీయ బ‌హుమ‌తి

వ్యాస‌రచ‌న సీనియ‌ర్స్‌:
1. ఎం.సాహిత్య‌, న్యూ గ‌వ‌ర్న‌మెంట్ డిగ్రీ కాలేజ్‌, ఖైర‌తాబాద్ - ప్ర‌థ‌మ బ‌హుమ‌తి
2. వి.రోహిత్‌, వివేకానంద జూనియ‌ర్ కాలేజ్, విద్యాన‌గ‌ర్ - ద్వితీయ బ‌హుమ‌తి
3. రితిక శ్రీ‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌ర్ కాలేజ్ ఆఫ్ కామ‌ర్స్ - తృతీయ బ‌హుమ‌తి

మరింత సమాచారం తెలుసుకోండి: