ఒక్కోసారి సమయానుకూలంగా స్పందించకపోతే మంచి అవకాశాలు కోల్పోతాం. అలాంటిదే ఇదీ.. తెలంగాణలో డిగ్రీ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. వీటికి దరఖాస్తు చేసేందుకు జనవరి 25 ఆఖరి తేదీ. అంటే ఎక్కువ సమయం లేదు.

 

మరి ఆ ఉద్యోగాలేంటో చూద్దామా.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ల నియామకాలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్‌పీఎస్సీ) పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.

 

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 36 ఉన్నాయి. ఇందులో ఐపీఎం-10, జీహెచ్‌ఎంసీ-26 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత.

 

వయసు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు జనవరి 25 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపిక ఆన్‌లైన్‌/ ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://tspsc.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: