భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుట్ వేర్ డిజైన్అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ) ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ఖాళీలు: 76 వరకూ ఉన్నాయి. అవేంటంటే.. ఫ్యాకల్టీ, క్ర్మా న్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్ తదితర పోస్టులు. మరి వీటికి అర్హతలు ఆయా పోస్టుని బట్టి ఉంటాయి. సాధారణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్ డీ ఉత్తీర్ణత అవసరం. అనుభవం కూడా కావాలి.

 

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 14న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://fddiindia.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: