మీరు డిగ్రీ చదువుతున్నారా.. అందులోనూ బీ కాం గ్రూపు చదువుతున్నారా.. అయితే ఈ శుభవార్త మీ కోసమే. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ఫిబ్రవరి 8వ తేదీన బీకాం విద్యార్థులకు తొలిసారిగా రాష్ట్రస్థాయిలో ప్రేరణ-2020 పోటీలను నిర్వహిస్తోంది. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా మీకు మంచి పోటీ తత్వం అలవడుతుంది.

 

ఈ పోటీలు మొదట కళాశాల స్థాయిలో ఆతర్వాత విశ్వవిద్యాలయం స్థాయిలో ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. బిజినెస్ క్విజ్, కామర్స్ క్వెస్టా, జస్ట్ ఏ మినిట్, వ్యాసరచన, వకృత్త్వ తదితర అంశాల్లో ఈ ప్రేరణ పోటీలు నిర్వహిస్తారు.


దీనిలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు తొలుత వర్సిటీల స్థాయిలో, వచ్చే నెల 8న హైదరాబాద్లోని భద్రుకా కళాశాలలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, టీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చెన్నప్ప తదితరులు ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: