ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నా యువ‌త ఎంద‌రో ఉన్నారు. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 7870 పోస్టుల్ని నియమిస్తోంది. అయితే దరఖాస్తుకు 4 రోజులే గడువుంది.  డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మొత్తం 7870 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎస్‌బీఐ ప్రకటించిన 7870 పోస్టుల్లో హైదరాబాద్ రీజియన్‌లో 375 ఖాళీలున్నాయి.



జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు 2020 జనవరి 2న నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్‌బీఐ. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ. జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్‌ను 2020 ఫిబ్రవరిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫిబ్రవరి లేదా మార్చిలో ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.



ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ వికలాంగులకు 13 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. అలాగే దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా sbi.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. కెరీర్స్ సెక్షన్‌లో junior associates recruitment లింక్ క్లిక్ చేయాలి. మీ వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.  ఆసక్తి గల అభ్యర్థులు https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: