భారతదేశంలోని 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2020'కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు యూపీఎస్‌సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో చేరాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఇక ఈ  నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం ఖాళీలు 418 భర్తీ చేయనున్నారు. 

 

రెండు దశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. పోస్టుల ఖాళీల విష‌యానికి వ‌స్తే.. మొత్తం ఖాళీలు- 418. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 (ఆర్మీ- 208, నేవీ- 42, ఎయిర్ ఫోర్స్-120), నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) - 48 ఉన్నాయి.  ఆర్మీ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్ ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 

 

ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2020 జనవరి 8వ తేది కాగా.. దరఖాస్తుకు చివరి తేదీ  2020 జనవరి 28 సాయంత్రం 6 గంటలు. అంతే రేపు ఒక్క రోజు మాత్రం గ‌డువు ఉంది. అర్హత గాల అభ్యర్థులు 02.07.2001 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. అలాగే పరీక్ష తేదీ.. 2020 ఏప్రిల్ 19న జ‌ర‌గ‌నుంది. సో.. లేట్ చేయ‌కుండా అర్హులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.
  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: