అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అందులోనూ నాబార్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 31 లాస్ట్ డేట్.. అందుకే అర్హతలు ఉన్నవారు త్వరపడండి.. ఇక ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే... నాబార్డులోని 154 ఉద్యోగాల కోసం జనవరి 10 వ తారీఖు ‌నుంచే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది.

 

ఇందులో 154 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడంది. దీని ప్రధాన కేంద్రం ముంబ‌యి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజ‌ర్‌ ( గ్రేడ్-) - ఖాళీల సంఖ్య: 154, మళ్లీ వీటిలో రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌ కోసం 139 పోస్టులు, రాజ్‌భాష స‌ర్వీస్‌ కోసం 8 పోస్టులు, లీగ‌ల్ స‌ర్వీస్‌ కోసం 3 పోస్టులు, ప్రోటోకాల్, సెక్యూరిటీ స‌ర్వీస్‌ కోసం 4 పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం 154 పోస్టులన్నమాట.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 31.01.2020న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం www.nabard.org అనే వెబ్ సైట్ ను చూడొచ్చు. నాబార్డు కేంద్ర ప్రభుత్వ సంస్థ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుతం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్.. దీని పూర్తి పేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: