హెచ్‌.సి.ఎల్.. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌. ఇదో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ పది తర్వాత ఐటీఐ చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కి చెందిన ఖేత్రి కాపర్‌ కాంప్లెక్స్‌ లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఇవి అప్రెంటిస్‌ ఖాళీలనే విషయం గమనించాలి.

 

ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ విభాగంలో మొత్తం ఖాళీలు 161 వరకూ ఉన్నాయి. ఏమేం ట్రేడులు ఉన్నాయంటే.. బ్లాస్టర్‌, ఫిట్టర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, వైర్‌మెన్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

 

ఈ ఉద్యోగాలకు పదోతరగతి, ఆ తర్వాత మీరు కోరుకుంటున్న ఉద్యోగానికి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28.01.2020 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగానే పోస్టుల భర్తీ ఉంటుంది.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: https://hindustancopper.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: