ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.  ముఖ్యంగా నవరత్నాల అమలు విషయంలో జగన్ మోహన్ రెడ్డి చూపిస్తున్న దూకుడుతో  మిగిలిన పార్టీలకి కంటిమీద కునుకుఉండటం లేదు. పధకాల అమలులో ఆర్ధిక అవసరాలతో పాటు ప్రజలకి పధకాలని అందించడానికి అవసరమయ్యే ఉద్యోగులని కూడా సమకూర్చుతూ ఖాళీగా ఉన్నా ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగులు అన్న పదం ఏపీలో వినపడకూడదనే ఉద్దేశ్యంతో వరుస వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.

 

2019 సంవత్సరంలో గ్రామా వార్డు సచివాలయాలలో లక్ష మందికిపైగా నియామకం జరిగిన విషయం అందరికి తెలిసినదే. ఎంపిక ప్రక్రియ అనంతరం 15వేల ఖాళీలను గుర్తించి వాటి నియామకానికి కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. దాంతో ఎక్కడెక్కడో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు కూడా తమ సొంత ఊళ్ళకి దగ్గరగా ఉంటూ సొంత జిల్లాలోనే మంచి జీతంతో ఉద్యోగం చేసుకుంటూ తల్లి తండ్రులకి దగ్గరగా ఉంటున్నారు. అయితే తాజాగా

 

ఏపీలోని వివిధ శాఖలలో ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే, అన్ని శాఖలలో ఇప్పటి వరకు సుమారుగా 63 వేల ఉద్యోగాలు భర్తీ  చేయవలసి ఉందని సీఎం కి నివేదికలు అందించారు. దాంతో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలని భర్తీ చేయాలని అధికారులకి  జగన్ సూచనలు ఇచ్చారట..

 

ప్రస్తుత ఖాళీల సమాచారం ప్రకారం ఎపీపీఎస్సీ నుంచి 19 వేలు, డీఎస్సీ నుంచి 21 వేలు, పోలీసుశాఖ నుంచి 13 వేల ఖాళీలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ ఖాళీలను బర్తీ చేయడానికి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీకి సంబంధించిన ఉద్యోగాల క్యాలండర్ జనవరి లో విడుదల చేయాలి కాని,ఇప్పటి వరకు చేయలేదు, బహుశా మార్చిలో ఈ క్యాలండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని తెలిస్తోంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: