మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నారా.. పదో తరగతి ఆపైన చదివారా.. అయితే ఇది మీకు నిజంగా గుడ్ న్యూసే.. ఎందుకంటే.. తెలంగాణ పట్టణ పేద రిక నిర్మూలన సంస్థ, మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ సంయుక్తంగా హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు కొన్ని కోర్సుల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు.

 

 

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ చలపతి ప్రకటించారు. యానిమేటర్, జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులో శిక్షణ ఇస్తారని తెలిపారు.

 

 

ఈ నెల 3వ తేది సోమవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో సూచించారు. ఇతర వివరాలకు హైదరాబాద్ వనస్థలిపురంలోని పనామ వద్ద గల సంస్థ కార్యాలయంలో
సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040 29553298, 9381853544 నెంబరులో సంప్రదించవచ్చు. ఒకవేళ ఈ ప్రకటన మీకు ఉపయోగపడకపోతే.. మీ వాట్సప్ , ఫేస్ బుక్ గ్రూపుల్లో పోస్టు చేయండి. అవసరమైన వారికి ఉపయోగపడవచ్చు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: