మనం ఎంత బాగా చదివాము అని చెప్పడంతో పాటు, మన తలరాతను నిర్ధారించేసి పరీక్షలే. పరీక్షల కాలం వచ్చిందంటే చాలు అటు విదార్థుల్లో పాటు, వారి తల్లి దండ్రుల్లో కూడా టెన్షన్ మొదలై పోతున్నది. పరీక్షలకు వారిని ఎలా ప్రిపేర్ చేయించాలి, ఎలా వారికి మంచి మార్కులు రప్పించాలి అనే విషయంలో తల్లి దండ్రులు తలమునకలౌతుంటారు.

 

ఒక వైపు పబ్జీ గేమ్, మరో వైపు పరీక్షల కాలం ఎలా వారిని పాబ్జీకి దూరం ఉంచాలి, వారిని ఎలా సరిగా చదివించాలి అని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం పరీక్షలకు చదువుకో, పబ్జీ పక్కన పెట్టి అని తల్లి దండ్రులు వారించినందుకు, ఆ విదార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇంత సున్నితంగా వుండే పసి హృదయాలను ఎలా దారిన పెట్టాలని అటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెగ ఆరాటపడి పోతున్నారు. 

 

అందుకు తల్లి దండ్రులు కొన్ని చిట్కాలు పాటించవలసిన అవసరం ఎంతో వుంది. అవి ఏమిటంటే తల్లి దండ్రులు ముఖ్యంగా మీ పిల్లలతో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి, వారిని పబ్జీ ఆడనీకుండా కాసేపు బయటికో, వారికి ఇష్టమైన వంటకాల్లో చేసి పెట్టండి 

 

ట్యూషన్స్ లో వేసేస్తే తమ బాధ్యత అయిపోతుందని భావించకండి, ఇప్పుడు వారికి తల్లిదండ్రుల సహాయం చాలా అవసరం. వారికి రానివి,అర్థం కానివి మీరు అర్థం చేసుకొని కాస్త ఓపికగా వారికి తెలిసేలా చెప్పండి. వారిని కసురుకోకుండా, వారితో ప్రేమగా మెలగండి.

 

తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం ఎంతో విలువైనది. మీ మాటలతో వారిలో స్ఫూర్తిని నింపండి, వారితో మీరు గడిపే సమయం మీ పట్ల విద్యార్థులకు ప్రేమతో పాటు, చదవాలన్న కసి ఏర్పడుతుంది. వారికి మంచి ఇన్స్పిరింగ్  కథలు చెప్పండి. వారికి సరైన ఆహారం తో పాటు, చక్కటి నిద్ర కూడా చాలా ముఖ్యం. గుర్తుఎంచుకొంది మీ పిల్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే వున్నదని.

 

స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షలను 2020 మార్చి 19 నుంచి 2020 ఏప్రిల్ 6 వరకు నిర్వహించనుంది. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న, స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి అని స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: