ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంకులో ఉద్యోగం కోసం యువత పోటీ పడుతూ ఉంటారు ముఖ్యంగా అభివృద్ధి చెందిన సిటీలో ఈ బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలను వినియోగించుకునేవారు అధికంగా ఉంటారు. మంచి జీతంతో పాటు వారి వారి సమర్థతను బట్టి అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కలిపిస్తాయి ఈ ప్రవైటు రంగ యాక్సిస్ బ్యాంక్ అంటున్నారు నిపుణులు..ఈ క్రమంలోనే..

Image result for young bankers

యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాం ను ప్రకటించింది బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నోయిడాలోని ఎమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ తో ఒప్పందం కుదుర్చుకుని యాక్సిస్ బ్యాంక్ young bankers program అందిస్తోంది. ఈ ప్రోగ్రాంలో లో పాల్గొని ఏడాదిపాటు శిక్షణ తీసుకుని ఎంపికైన వారికి ఉన్నతమైన స్థానాలను కల్పించనుంది.

 

ఏడాదిపాటు ఇచ్చే శిక్షణలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్, సేల్స్ అండ్ కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ , ట్రేడ్ ఫైనాన్స్ , ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్,  రిటైల్ బ్యాంకింగ్ , సేల్స్ కమర్షియల్ బ్యాంకింగ్ లాంటి అంశాలలో శిక్షణ ఇస్తుంది అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ బ్యాంకింగ్ సర్వీస్ సర్టిఫికెట్ తో పాటు మంచి ఉద్యోగాన్ని కూడా అందిస్తుంది ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ తో పోలిస్తే త్వరగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది..

 

శిక్షణ కాలం - ఏడాది

వయసు -  21 నుంచి 30 ఏళ్లు లోపు ఉండాలి

విద్యార్హత -  గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, 50 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి.

ప్లేస్మెంట్ - కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాన్ని వారి సామర్థ్యాన్ని బట్టి కల్పిస్తారు

 

ఫీజు – రూ. 3.29 లక్షలు, 13% వడ్డీతో బ్యాంక్ లోను కూడా ఇస్తారు.

జీతం - వార్షిక వేతనం  రూ.4.12 లక్షలు.

మరిన్ని పూర్తి వివరాలకోసం

 

https://axisbank.myamcat.com/

 

మరింత సమాచారం తెలుసుకోండి: