చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై దృష్టి పెడుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగమైతే ఉద్యోగ భద్రత ఉంటుందని చదువుని బట్టి అత్యున్నతన స్థితికి కూడా చేరుకోవచ్చని. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాకుండా ప్రవైటు ఉద్యోగాలలో కూడా  అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే  ఉద్యోగ భద్రతకి డోకా ఉండదు. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసుకుని ఫ్రెష్ గా ఉద్యోగంలో చేరి తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగంలో కంటే కూడా ఎదుగుదల ఎంతో వేగంగా ఉంటుంది..

 

 

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తాజాగా బీటెక్ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలని కలిపిస్తోంది. ఈ ఏడాదికి గాను సుమారు 20,000 వేల ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు భారత దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలలో జల్లెడ రిక్రూట్మెంట్ డ్రైవ్ లని చేపట్టడానికి సిద్దమవుతోంది. ఈ మేరకు కాగ్నిజెంట్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

కొత్తగా బీటెక్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్ కి 18 శాతం మేరకు జీతాలని పెంచనుంది. అంటే సుమారు ఏడాదికి 400,000ల రూపాయల వరకూ వేతనం లభిస్తుంది. భారత దేశంలో ఎంతో మంది యువతలో సామర్ధ్యాలు ఉన్నాయని వాటిని మేము వినియోగించుకుంటామని తెల్పింది. ఇదిలాఉంటే బీటెక్ పూర్తి అయినవాళ్ళుకి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి ఏడాదికి 4 లక్షల వేతనం ఏ సంస్థ ఇవ్వడంలేదని కానీ కాగ్నిజెంట్ టెక్నాలజీ ఫ్రెషర్స్ కి ఏడాదికి 4 లక్షల వేతనం వేతనం ఇవ్వడం సంచలనమని అంటునారు టెక్ నిపుణులు...

మరింత సమాచారం తెలుసుకోండి: