పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటే పిల్లలకంటే కూడా పిల్లల తల్లి తండ్రులలలో ఎక్కువ టెన్షన్ మొదలవుతుంది. 9 వ తరగతి దాటి పదిలోకి తమ పిల్లలు వచ్చారంటే వారికి పగలు రాత్రికి పెద్ద తేడా తెలియదు. ఒక మెషిన్ పనిచేసినట్టుగా పిల్లలు చదువుతూనే ఉంటారు. కానీ వారిపై ఎలాంటి ఒత్తిడి పడుతుంది అనే విషయాలని మాత్రం చాలా మంది పరిగణలోకి తీసుకోరు. ఈ క్రమంలోనే ఎంతో ఒత్తిడికి లోనయ్యి చివరికి మానసికంగా కుంగిపోతారు. తద్వారా ఊహించిన రిజల్స్ పిల్లలు చేరుకోలేరు.

 

ఇదిలాఉంటే బాగా చదివే వాళ్ళు సైతం చిన్న చిన్న తప్పులు చేస్తూ స్కోరింగ్ లో వెనకబడి పోతూ ఉంటారు.మరి కొందరు చదివిన విషయాలు చాలా వరకూ మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది విద్యార్ధులకి ఎదురవుతూ ఉంటాయి. తల్లి తండ్రులు సైతం ఈ విషయాలలో ఎంతో బాధపడిపోతూ ఉంటారు.

రకరకాల సమస్యలు 10వ తరగతి పిల్లల, తల్లి తండ్రుల విషయాలలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడి, ఈ పరీక్షల్లో గట్టెక్కాలన్నా , పిల్లలు పరిక్షల్లో మంచి స్కోరింగ్ సాధించాలన్నా, చదివిన ప్రతీ విషయం గుర్తు పెట్టుకోవాలన్నా కొన్ని సూచనలు పాటిస్తే అన్ని అవరోధాలు సులభంగా దాటేయచ్చు, మంచి స్కోరింగ్ పొందచ్చు.

 

  • చదివిన ప్రతీ విషయం గుర్తు పెట్టుకోవాలంటే గ్రూప్ డిస్కర్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. చదివిన ప్రతీ విషయాన్ని బండ గుర్తుగా గుర్తు పెట్టుకునే దానికంటే కూడా బుర్రలో పదిలంగా ఉండిపోవాలంటే గ్రూప్ డిస్కర్షన్ ఎంతో ముఖ్యం.
  • అలాగే పిల్లలు చదువుకుంటున్న వాతావరం వారికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
  • అలాగే మనం ఎంత కష్టపడి చదివినా సరే పరీక్షల్లో మన చేతి రాత గనుకా అందామా లేకపోతే మార్కులకి కత్తెర పడక మానదు.
  • ముఖ్యంగా ప్రశ్నా పత్రం చూసిన వెంటనే మనకి తెలిసిన ప్రశ్నలకి సమాధానాలు రాసేయండి. రాతలో కొట్టివేతలు లేకుండా చూసుకోండి.
  • మీరు రాసే సమాధానాలు అందంగా కనపడాలంటే తప్పకుండా మార్జిన్ ఉండాల్సిందే. మార్జిన్ లోపలనే సమాధానాలు రాసేలా ముందు నుంచీ ప్రయత్నించండి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: