ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. కేంద్రంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఒక పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ఆదారంగా మూడేళ్లలోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.

 

 

అంటే.. ఇకపై ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా నాన్‌ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు.

 

 

ఆ నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇక ఈ నిర్ణయం అమలైతే.. నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: