అన్ని ఉద్యోగాలకూ రాత పరీక్షలు ఉండవు. కొన్ని ఉద్యోగాలు అకడమిక్ మెరిట్ పై కూడా ఇచ్చేస్తారు. అలాంటిదే ఈ ఉద్యోగం. కాకపోతే ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని సీఎఆర్-సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎసీఆర్‌).. సైంటిస్టు ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ జనవరి 8 నుంచి మొదలైంది.

 

ఇందులో మొత్తం 31 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అవేమిటంటే.. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఈ 31 పోస్టుల్లో సైంటిస్ట్-25, సీనియర్ సైంటిస్ట్-03, ప్రిన్సిపల్ సైంటిస్ట్-08గా ఉన్నాయి.

 

ఇక అర్హతల విషయానికి వస్తే.. పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లోఎంఈ / ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌ లైన్‌ ద్వారా అప్లయ్ చేసుకోవడానికి టైమ్ అయిపోయింది. దరఖాస్తు హార్డ్ కాపీలు పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 21, 2020. మరిన్ని వివరాల కోసం https://cftri.res.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు. మీకు అర్హత ఉంటే త్వరపడండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: