సైనిక్ స్కూళ్లంటే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి సైనిక్ స్కూళ్లో ఉద్యోగం..అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రావాలని చాలామంది కోరుకుంటారు. ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందింది. ఏపీలోని చిత్తూరు ఏపీలోని సైనిక్‌ స్కూల్‌, కలికిరికింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

 

వివిధ రకాలైన మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. వీటిలో స్కూల్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఆర్ట్‌ మాస్టర్‌, పీఈటీ, కౌన్సెలర్‌, బ్యాండ్‌ మాస్టర్‌, క్రాఫ్ట్‌ మాస్టర్‌, మాట్రన్‌ (ఫిమేల్‌), కుక్‌ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే ఒక్కో పోస్టుకు ఒక్కోలా ఉన్నాయి.

 

 

పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, పని అనుభవం కూడా చూస్తారు. రాతపరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

 

ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరితేది: ఫిబ్రవరి 29, 2020. ఒక్క కుక్‌ పోస్టుకు మాత్రం రాత పరీక్ష లేదు. నేరుగా మార్చి 02, 2020 తేదీన వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇవన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలన్న సంగతి గమనించాలి. మరిన్ని వివరాల కోసం http://www.kalikirisainikschool.com/ వెబ్ సైట్ చూడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: