మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయాలని ఆశించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారికోసం క్యాప్ జెమినీ అనే మల్టీ నేషనల్ కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. కేవలం కాలేజ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా ఉద్యోగాలని భర్తీ చేయనుంది. సుమారు 15 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెద్ద ఎత్తున వివిధ కాలేజీలలో రిక్రూట్మెంట్ చేపడుతున్న సదరు కంపెనీ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి 3,80.000 వార్షిక వేతనాన్ని అందిస్తోంది. అయితే ఐఐటీ , ఎన్ఐటీ విద్యార్ధులకి వార్షిక వేతనం 6,50,000 ఉంటుందని తెలిపింది.

 

గతంలో ఇదే తరహాలో కాగ్నిజెంట్ కూడా భారతదేశంలో ఫ్రెషర్స్ కోసం సుమారు 20,000 ఉద్యోగాలని వార్షిక వేతనం 4,00,000 గా నిర్ధారించి ఉద్యోగ ప్రకటన చేసిన విషయం విధితమే. ఈ క్రమంలోనే క్యాప్ జెమినీ కూడా భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటన చేయడంలో విద్యార్ధుల్లో సంతోషం నెలకొంది. ప్రస్తుతానికి క్యాప్ జెమినీ ఆఫీసుల్లో సుమారు 1.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా మరిన్ని ఉద్యోగాల కల్పనకి నిర్ణయం తీసుకుంది.

 

క్యాప్ జెమినీ తమ సంస్థ నుంచీ మరిన్ని కంపేనీలు స్థాపించనున్న క్రమంలోనే ఈ ఉద్యోగ ప్రకటన చేసినదని అంటున్నారు నిపుణులు. ఇదిలాఉంటే ఫెంచ్ ఐటీ సర్వీస్ కంపెనీ అయిన క్యాప్ జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో సగానికి పైగా భారత్ నుంచీ వచ్చిన వాళ్ళే కావడం మరొక విశేషం. 5 జీ టెక్నాలజీ ఉపయోగాలపై  ప్రయోగాలు చేస్తున్న సదరు కంపెనీ ప్యారిస్ , ముంబై లలో రెండు ల్యాబ్ లు ప్రారంభించినట్టుగా సంస్థ ఇండియా సిఈవో తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: