రైల్వేలో రాత పరీక్ష లేకుండానే జాబ్ సంపాదించే అవకాశం వచ్చింది. అయితే తాజాగా వచ్చిన ఓ నోటిఫికేషన్ లో రాత పరీక్ష ప్రస్తావనే లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగానే నియామకాలు ఉంటాయట. ఇంతకీ ఏ రైల్వే అంటారా.. వెస్ట్ సెంట్రల్ రైల్వే.. WCRలో 200 ఖాళీలు ఉన్నాయి.

 

రైల్వే ఉద్యోగాలంటే నిరుద్యోగుల్లో ఉన్న క్రేజ్ వేరు. ఆఫీసర్ పోస్టు నుంచి గ్యాంగ్ మెన్ వరకూ ఏదో ఒక ఉద్యోగం రైల్వేలో సంపాదించాలని కలల కనే నిరుద్యోగులెందరో. అయితే వీటికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఇలాంటి గండాలు చాలా ఉంటాయి.

 

భోపాల్‌ ప్రధానకేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే లో మొత్తం 200 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ దరఖాస్తులు కోరుతోంది. ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. అర్హత: ఇంటర్మీడియట్‌ మరియు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, 2020 ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://wcr.indianrailways.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: