ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి రాష్ట్రంలో ఎన్నో మార్పులు. చేర్పులు చేస్తూ వస్తుంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని పథకాలు అమలు చేస్తు ప్రజలందరికీ మంచి చేస్తూ ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఈ నేపధ్యంలొనే మరో పడిరోజులలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టనుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ మార్పులు ఇంటర్ విద్యార్ధులను భయాందోళనకు గురి చేస్తుంది. 

 

అంత భయానికి గురి చేసే అంశం ఏంటి అంటే? ప్రస్తుతం ఇంటర్ పరీక్షల నిర్వహిస్తున్న తీరుపై భారీ  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. దీంతో ఇంటర్ బోర్డు భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ అధికారుల నుంచి పలు అభిప్రాయాలను సేకరించి ఇక నుంచి పూర్తి స్థాయిలో జంబ్లింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని చూస్తున్నారు. జంబ్లింగ్ విధానం అంటే పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్‌‌లతో సహా ఇన్విజిలేటర్లు, డీవోలు అందరూ కూడా  బయటవారే ఉంటారు. ఏ పరీక్షా కేంద్రంలో కూడా ఆ కాలేజీకి సంబంధించిన లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు ఎవరు ఉండరు. 

 

ఇప్పుడు జరగబోయే పరీక్షలలో ఇన్ని మార్పులు జరుగుతుంటే.. ఇటీవలే తాజాగా పూర్తయిన ప్రాక్టికల్ పరీక్షల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. పరీక్ష జరుగుతున్న సమయంలో అటెండర్‌, వాటర్‌ బాయ్‌, ఇతర సహాయ సిబ్బంది ఎవరు కూడా పరీక్ష జరుగుతున్న క్లాస్ రూమ్ లోకి వెళ్లేందుకు ఇంటర్ బోర్డు అనుమతులు ఇవ్వలేదు. అలాగే సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. 

 

కేవలం పరీక్షలు జరిగే విధానంలోనే కాదు.. రెండేళ్ల క్రితం వచ్చిన గ్రేడింగ్ సిస్టంకు కూడా ఈ ఏడాది నుండి స్వస్తి పలకాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే.  గ్రేడింగ్ కు ముందు ఉన్న పద్దతిలో మాదిరిగా మార్కులతో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ క్లాస్‌లను ఇవ్వాలనే నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీన విద్యాశాఖ మంత్రి ప్రకటించనున్నట్టు సమాచారం.  కాగా మార్చి 4 నుండి 18 వరుకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: