కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మధ్యప్రదేశ్లో ఉంది. ఈ సంస్థ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 120 వరకూ ఉన్నాయి. ఈ ఏ ఏ విభాగాల్లో ఖాళీలున్నాయంటే.. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్స్మెన్, సర్వేయర్, కార్పెంటర్, ప్లంబర్ తదితరాల్లో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అర్హత పదోతరగతి. ఆ తరువాత సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు: 31.01.2020 నాటికి 25 ఏళ్లు మించకూడదు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షతేది: మార్చి 29, 2020న ఉంటుంది. దరఖాస్తులు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తులు పోస్టులో చేరేందుకు చివరితేది మార్చి 12, 2020. మరిన్ని వివరాలో కోసం https://www.hindustancopper.com వెబ్ సైట్ ను చూడొచ్చు.