చదువు, ఉపాధి అన్ని రంగాల్లోనూ వెనుక బడిన వర్గాలకు ప్రత్యేక పథకాలు ఉంటాయి. రిజర్వేషన్లు వారికి అండగా ఉంటాయి. స్కాలర్ షిప్పులు ఉంటాయి. కానీ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం మాత్రం ఎలాంటి పథకాలు ఉండవు. ఇప్పుడు క్రమంగా ఆ లోటు తీరుతోంది. అగ్రవర్ణ పేదలకు కూడా మంచి పథకాలు లభిస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే పథకం అలాంటిదే.

 

 

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువత కోసం ఏపీ సర్కారు భారతి అనే పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో చదివే యువతకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ ఏర్పాట్లన్నీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది.

 

 

ఇప్పటికే ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు కార్పొరేషన్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రూ. 6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు.

 

 

కనీసం ఏడాది కాలం మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి పథకాల గురించి సరైన ప్రచారం నిర్వహిస్తే నిరుపేద బ్రాహ్మణులు వాటిని వినియోగించుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: