ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ క్యాప్ జెమిని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత్ లో ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. సంస్థ సీఈవో మాట్లాడుతూ ఫ్రెషర్స్ తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని అన్నారు. కంపెనీలో ప్రస్తుతం 10 - 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్కిటెక్ట్ లుగా పోస్టింగ్ లు ఇస్తున్నట్టు సీఈవో తెలిపారు. 
 
క్యాప్ జెమిని కంపెనీ ఫ్రాన్స్ కు చెందినది అయినప్పటికీ కంపెనీలో సగానికి పైగా భారతీయులే పని చేస్తున్నారని చెప్పారు. భారత్ లో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులన్న ఈ కంపెనీలో అదనంగా 30,000 మంది ఉద్యోగులు చేరనున్నారు. కంపెనీ క్లయింట్ల నుండి అధికంగా డిమాండ్ ఉండటంతో ఉద్యోగులను నియమించుకోనుంది. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులపై పడకుండా ఉండేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ తాము ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అభివృద్ధి కోసం చేపడుతున్నట్టు ప్రకటన చేసింది. 
 
క్యాప్ జెమిని ఆటోమేషన్ ఉద్యోగులకు మరింత డిమాండ్ కల్పించనుందని చెబుతోంది. ఇప్పటికే ఆటోమేషన్ ప్రభావం వల్ల చాలా కంపెనీలు నియామకాలను తగ్గించాయి. డిజిటల్, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకున్నవారికి ఉద్యోగ నియామక అవకాశాలు పెరుగుతున్నాయి. క్యాప్ జెమిని ఫ్రెషర్స్ కు సగటు వార్షిక వేతనం రూ. 3.8 లక్షలు ఆఫర్ చేస్తోంది. ఐఐటీ స్టూడెంట్లకు ఈ ప్యాకేజీ రూ. 6.5 లక్షల వరకు ఉంటుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: