ప్రజల ఆకలిని తీర్చే బాధ్యతను రైతు తన భుజాల మీద వేసుకుంటే దేశ పౌరులంతా నిర్భయంగా, నిశ్చింతగా ఉండేందుకు సైనికుడు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతుంటాడు. సైనికులు దేశాన్ని రక్షించడం కోసం తమ జీవితాలను ఆర్పిస్తున్నారు. దేశం లోపలా ఉగ్రవాదాన్ని అణచడానికి.. ప్రకృతి విపత్తులనుంచి ప్రజలను ఆదుకునేందుకు ఎల్లవేళలా ముందడుగు వేస్తుంటాడు. ఘనకీర్తి కలిగిన సైన్యంలో పనిచేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి నేడు పలువురు యువకులు ముందుకొస్తున్నారు. 

 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సైనికుడిగా దేశ సేవ చేయాల‌నుకునే వారికి.. బోర్డర్‌కు వెళ్లి దేశానికి రక్షణగా నిలవాలనుకునే వారికి.. శత్రు మూకల భరతం పట్టాలనుకునే వారికి.. ఓ శుభ‌వార్త వ‌చ్చింది కాబ‌ట్టి. ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకు శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ తరఫున ఫిజికల్ ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే యువతకు ఈ అవకాశం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. కేవ‌లం ఉచిత‌ ట్రైనింగ్ మాత్రమే కాదు.. హాస్టల్ ఫుడ్, వసతి ఉచితమేనని ఆర్మీలో బ్లాక్ కమెండోగా పనిచేసిన సాయి కృష్ణారెడ్డి తెలియ‌చేశారు.

 

ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ గోల్కొండ దగ్గర శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీలో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే.. తానే స్వయంగా ఫిజికల్‌ ట్రైనింగ్ ఇస్తానని, ఫిజికల్ టెస్ట్‌ను 100 శాతం క్లియర్ చేయించే బాధ్యత తనదేనని ఆయన వివరించారు. ఫిజికల్ ట్రైనింగ్‌ను తట్టుకునే సామర్థ్యం ఉంటే మార్చి 15లోపు తల్లిదండ్రులతో కలిసి అకాడమీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మెడికల్ టెస్ట్ చేసిన తర్వాతే విద్యార్థులకు అకాడమీలోకి తీసుకుంటామని వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: