ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నాయి. నోటిఫికేష‌న్స్ ప‌డుతున్నాయ‌ని తెలియ‌క మంచి మంచి అవ‌కాశాల‌ను మిస్ చేసుకుంటున్న వారు మ‌రికొంద‌రు.  అయితే ప్ర‌ముఖ‌ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ తెలిపింది.గేట్ 2020 ద్వారా గెయిల్ సంస్థ పలు ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం గెయిల్ అధికారిక వెబ్‌సైట్‌ www.gailonline.com ను చూడొచ్చు.

 

మొత్తం 25 ఉద్యోగ ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ చేపడుతున్నారు. అందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్).. 15 పోస్టులు ( యుఆర్-6, ఈడబ్ల్యూఎస్ - 2, ఎస్సీ- 1, ఓసీసీ- 6) మ‌రియు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్‌స్ట్రుమెంటేషన్).. 10 పోస్టులు (యుఆర్-5, ఈడబ్ల్యూఎస్ - 1, ఎస్సీ- 1, ఎస్టీ-1, ఓసీసీ- 2) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ఏంటంటే.. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్)గానూ.. ఆసక్తిగల అభ్యర్థులు కెమికల్ / పోట్రోకెమికల్ / కెమికల్ టెక్నాలజీ/ పెట్రోకెమికల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాల్లో 65 శాతానికి పైగా మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

 

అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్‌స్ట్రుమెంటేషన్)గానూ.. ఆసక్తిగల అభ్యర్థులు ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో 65 శాతానికి పైగా మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ.. 2020 మార్చి 12వ తేదీ సాయంత్రం 6 గం.ల వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా గేట్ 2020 కోసం నమోదుచేసుకోవాలి. గేట్ 2020 పరీక్ష రాయాలి. మరిన్ని వివరాల కోసం gailonline.com వెబ్‌సైట్‌లో చూడండి. ఇక ఎంపికైన అభ్యర్థుల పే స్కేల్ రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు ఉంటుంది. జీతంతో పాటు కంపెనీ బస వసతి / లీజ్ బస వసతి / హెచ్ఆర్ఏ, వైద్య సదుపాయం, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, కన్వేయన్స్ అడ్వాన్స్, ఫర్నిషింగ్ అడ్వాన్స్ / పీసీ అడ్వాన్స్ తదితరాలు కల్పిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: