దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని యువకులు ఉద్యోగాలు లభించక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే రోడ్డున కూడా ప‌డుతున్నారు. అయితే అందులో కొంద‌రికి నోటిఫికేష‌న్స్ ప‌డుతున్నాయ‌ని తెలియ‌కే .. ఉద్యోగాల‌కు మిస్ చేసుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

టెక్నికల్ విభాగంలో మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు https://nhai.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్స్‌ని 2020 మార్చి 26 లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఇక ఇప్ప‌టికే ఈ పోస్టుల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ స్టాట్ అయింది. మ‌రియు దరఖాస్తుకు 2020 మార్చి 11 చివరి తేదీ. 

 

పోస్టుల విష‌యానికి వ‌స్తే.. మొత్తం 170  ఖాళీలు ఉన్నాయి. అందులో 46 మేనేజర్ (టెక్నికల్) కాగా..  124 డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులు. అలాగే సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఇక మేనేజర్ పోస్టుకు హైవేస్, రోడ్స్, బ్రిడ్జెస్ లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మూడేళ్లు అనుభవం, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు ఆరేళ్ల అనుభవం కూడా ఉండాలి. కాబ‌ట్టి ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు లేట్ చేయ‌కుండా ధ‌ర‌కాస్తు ప్ర‌క్రియ ప్రారంభించంది.

మరింత సమాచారం తెలుసుకోండి: