ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? నిజానికి చదువు పూర్తయినా.. ఉద్యోగం దొరకని పరిస్థితి నేడు. ఉద్యోగాలున్నా... సరైన నైపుణ్యాలున్నవారు దొరకడం లేదని కంపెనీలు అంటున్నాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మీకో గుడ్ న్యూస్‌. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అయితే ఇవి 12 నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే.

 

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ.  మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్హత విష‌యానికి వ‌స్తే..  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-ICMAI లో ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఇక 2020 మార్చి 1 నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్.. రూ.22,000.

మరింత సమాచారం తెలుసుకోండి: