ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్  భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 7 చివరి తేదీ. మొత్తం 51 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hslvizag.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు.

 

మొత్తం పోస్టులు, వాటి వివ‌రాల విష‌యానికి వ‌స్తే.. ఖాళీలు మొత్తం 51 ఉండ‌గా.. అందులో డిజైనర్ Gr-IV (మెకానికల్) 10, డిజైనర్ Gr-IV (ఎలక్ట్రికల్) 3, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (మెకానికల్) 7, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్) 9, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (సివిల్) 7, ఆఫీస్ అసిస్టెంట్ (సెక్రెటేరియల్) Gr-V 9, జూనియర్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ Gr-IV 4, డ్రైవర్ Gr v 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

ఇక సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ విద్యార్హత ఉండాలి. రూ.200 ద‌ర‌ఖాస్తు ఫీజు చ‌ల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసి ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు అప్లికేషన్ ఫామ్ పంపాలి. 2020 మార్చి 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం కాగా, 2020 ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటలు వ‌ర‌కు దరఖాస్తు చివరి తేదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: