ఉన్న‌త చ‌దువులు చ‌దివి కూడా.. ఉద్యోగాలు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? అయితే మీకో శుభ‌వార్త‌. భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. మొత్తం 147 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా.. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెబీ.  

 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇక ఇప్ప‌టికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 7న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ.  అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100 దరఖాస్తు ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య- 147
జనరల్- 80
లీగల్- 34
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22
అఫీషియల్ లాంగ్వేజ్- 1
ఇంజనీరింగ్- 5
రీసెర్చ్- 5

 

విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.

 

దరఖాస్తు ప్రారంభ తేదీ- 2020 మార్చి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23

 

ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 ఏప్రిల్ 12
ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 మే 3
ఫేజ్ 3 ఇంటర్వ్యూ- ఫేజ్ 2 ఫలితాల తర్వాత వెల్లడించనున్న సెబీ

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: