శ్రీహరికోట.. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న ఏకైక అంతరిక్ష ప్రయోగ కేంద్రం. మన రాష్ట్రానికే తలమానికం. సాధార‌ణంగా ఇస్రో ఓ రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తోదంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరి కళ్లూ శ్రీహరికోట మీదే ఉంటాయి. శ్రీహరికోటకు గానీ, అక్కడున్న సతీష్ ధవన్ ప్రయోగ కేంద్రానికి గానీ ఉన్న పేరు అలాంటింది. ఇదిలా ఉంటే.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కోసం పలు కాళీలను భర్తీ చేస్తోంది.  నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్‌మెన్ లాంటి పోస్టులున్నాయి.  ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 12  ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 7 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 27 చివరి తేదీ. 

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 12 ఉన్నాయి. అందులో నర్స్ బీ 2, ల్యాబ్ టెక్నీషియన్ ఏ 3, ఫైర్‌మ్యాన్ ఏ 7 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. నర్స్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు మూడేళ్ల నర్సింగ్ కోర్స్ పూర్తి చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ సర్టిఫికెట్ ఉండాలి. ఫైర్‌మ్యాన్ ఏ పోస్టుకు పదవ తరగతి పాస్ కావాలి. ఇక‌ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. మ‌రియు ఫైర్‌మ్యాన్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు ఉంటే స‌రిపోతుంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌త అభ్య‌ర్థులు వెంట‌నే ధ‌రకాస్తు ప్రారంభించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: