B.E.L.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఇదో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో అనేక ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో మొత్తం 174 వరకూ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగం వస్తే జాక్ పాట్ కొట్టినట్టే.. దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే అఖరి రోజు.

 

బీఈఎల్ లోని 174 ఉద్యోగాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ట్రేడ్ అప్రెంటీస్.. మరొకటి డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు 150 వరకూ ఉన్నాయి. ఇక డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు 24 వరకూ ఉన్నాయి.

 

 

అర్హతల విషయానికి వస్తే.. ట్రెడ్ అప్రంటీస్ కు ఐటీఐ, డిప్లమో ఉన్నవారు అర్హులు.. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తుకు వివిధ తేదీలు ఉన్నాయి. ట్రేడ్ అప్రంటీస్ పోస్టులకు ఇవాళే అంటే 16- మార్చ్ ఆఖరు తేదీ. డిప్యూటీ ఇంజినీర్ ఉద్యోగాలకు మార్చి 21 ఆఖరు తేదీ.

 

 

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. www.bel-india.in వెబ్ సైట్ చూడొచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: