ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ కామర్స్ దిగ్గజం.. అమెజాన్ లక్ష మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించింది. ఒకేసారి లక్ష మంది ఉద్యోగులు ఎందుకు అంటారా..? అమెరికాలో కరోనా భయంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడ స్తంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ వెబ్ సైట్లకు గిరాకీ పెరిగింది.

 

 

ఈ పెరిగిన గిరాకీని అందుకునేందుకు అమెజాన్ సంస్థ కొత్త గా లక్ష మంది ఉద్యోగులను తీసుకోబోతోందట. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకూ వారికి తమ కంపెనీలో పూర్తి, పార్ట్‌టైం ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్‌ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అమెజాన్ తరహాలోనే మిగిలిన కొన్ని ఈ కామర్స్, రిటైల్ సంస్థలు కూడా కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

 

 

ఇంకో శుభవార్త ఏంటంటే.. అమెజాన్ సంస్థ.. ఈ పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం పెంచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రతి గంటకు వారికి చెల్లించే మొత్తం 15 డాలర్లు.. ఇకపై దీన్ని 17డాలర్లకు పెంచుతున్నట్లు అమెజాన్‌ సంస్థ ప్రకటించింది. సంక్షోభంలోనూ అవకాశం రావడం అంటే ఇదేనేమో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: