ఉన్న‌ది చ‌దువులు చ‌దివి కూడా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్‌. నిరుద్యోగుల‌కు చేయూత ఇవ్వ‌డానికి  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఇటీవ‌ల ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

 

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ. అంతే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఇలాంటి మంచి అవ‌కాశం ఎప్పుడొస్తుందో.. ఏమో. కాబ‌ట్టి అర్హులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 116
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 23
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 5
ఎలక్ట్రీషియన్- 20
కార్పెంటర్- 2
టర్నర్- 5

 

ఎలక్ట్రానిక్స్- 2ఫిట్టర్- 33
మెషినిస్ట్- 11
ప్లంబర్- 2
వెల్డర్- 6
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 5
పెయింటర్- 2

 

విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.

 

ముఖ్య‌తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23

మరింత సమాచారం తెలుసుకోండి: