ప్ర‌స్తుత దేశంలో అనేక మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న‌దంతా చ‌దువుల‌కు పెడుతుంటే.. ఆ త‌ర్వాత ఉద్యోగం రాక చాలా కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. మనిషి జీవితం లో ఉద్యోగం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కానీ, క‌నీస ఉద్యోగం దొర‌క‌క ఎంద‌రో యువ‌త నానా ఇబ్బందులు ప‌డుతున్నాయి. అయితే అలాంటి వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్‌. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలను ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. టెక్నాలజీ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. 

 

నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్ప‌టికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 27 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి ఇలాంటి అవ‌కాశాన్ని అస్స‌లు మిస్ కాకండి.

 

పోస్టుల వివ‌రాలు ప‌రిశీలిస్తే..
మొత్తం ఖాళీలు- 39
బిజినెస్ అనలిస్ట్ లీడ్- 2
బిజినెస్ అనలిస్ట్- 5
వెబ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్- 6
టెక్నాలజీ ఆర్కిటెక్ట్- 1

 

ప్రోగ్రామ్ మేనేజర్- 1
క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్- 2
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడ్- 1
డేటాబేస్ ఆర్కిటెక్ట్- 1
ఎమర్జింగ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్- 3

 

మొబైల్ అప్లికేషన్ డెవలపర్- 5
UI/UX డిజైనర్ 2
డేటా అనలిస్ట్- 4
డేటా ఇంజనీర్- 4
ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్- 2

 

విద్యార్హతలు.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 27


 

మరింత సమాచారం తెలుసుకోండి: