ఉన్న‌త చ‌దువులు చ‌దివి కూడా ఉద్యోగాలు లేక ఎంద‌రో యువ‌త ఇబ్బంది ప‌డుతున్నారు. వ్యవసాయం చేయలేక రైతులు, ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్‌. మూడు నోటిఫికేషన్ల ద్వారా 733 ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 26 లాస్ట్ డేట్. అంటే రేపు ఒక్క‌రోజే గ‌డువు మిగిలి ఉంది. మరి ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాల‌పై ఓ లుక్కేసేయండి.

 

నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

 

దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఇవి 12 నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఇక చివ‌రిగా  భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 182 పోస్టులున్నాయి. అభ్యర్థులు ముందుగా https://www.apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక‌ ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. కాబ‌ట్టి ఇలాంటి మంచి అవ‌కాశాల‌ను మిస్ చేసుకోకండి. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ధ‌ర‌కాస్తు ప్రారంభించండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: